వివాహిత అదృశ్యం..

మండలంలోని కొత్తకొండ గ్రామానికి చెందిన

Update: 2024-06-26 15:46 GMT

దిశ,భీమదేవరపల్లి: మండలంలోని కొత్తకొండ గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎనగందుల రాజు కొత్తకొండ గ్రామ వాసి. తన భార్య ఎనగందుల నాగమణి(36). నాగమణి తేదీ 19/06/2024 రోజున ఉదయం 10 గంటల సమయంలో తన పెద్ద కూతురును వంగర హాస్టల్ లో పంపించి మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాలేదు. అదే రోజు ఇద్దరు భార్యాభర్తలకు ఇంట్లో గొడవ జరిగింది. అది గమనించిన రాజు బంధువులకు ఫోన్ చేసి తెలుసుకోనగా ఎవరి వద్ద లేనందున బుధవారం రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు వివరాలు ముల్కనూర్ ఎస్సై ఎన్.సాయి బాబు తెలిపారు.

Similar News