ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో 2007-08 పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.
దిశ, జనగామ : జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో 2007-08 పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, హనుమంతరావు, ఉపాద్యాయులు సరోత్తం రెడ్డి, భిక్షపతి, చంద్రశేఖర్, హరిశంకర్, పీఈటీ వీరాకుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.