Minister Ponguleti : హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైదరాబాద్(Hyderabad)కు సమానం(Equally)గా పాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి(Warangal Development) చేయాలన్న ఆలోచనతో ఉన్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైదరాబాద్(Hyderabad)కు సమానం(Equally)గా పాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి(Warangal Development) చేయాలన్న ఆలోచనతో ఉన్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
హైదరాబాద్ స్థాయిలో వరంగల్ ను తీర్చిదిద్దడంలో భాగంగా మొదటి సంవత్సరం పూర్తి కాకముందే సీఎం రేవంత్ రెడ్డి రెండు పర్యాయాలు వరంగల్ పట్టణానికి వచ్చారని పొంగులేటి తెలిపారు. మొదటిసారి పర్యటన సందర్భంగా చేయాల్సిన అభివృద్ధిపై స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి అభిప్రాయాలను తీసుకొన్నారన్నారు. ఎయిర్ పోర్ట్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు.
రెండో పర్యాయం వచ్చినప్పుడు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని..వరదలాగా 6 వేలకు పైగా కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. 2041 మాస్టర్ ప్లాన్ మంజూరు చేయడం జరిగిందని, భద్రకాళి చెరువు పూడికతిత, వివిధ అభివృద్ధి, మౌలిక వసతులు కల్పన టెండర్లు పిలిచామని పొంగులేటి పేర్కొన్నారు.