కాంగ్రెస్ సీనియర్లకు.. Revanth Reddy వర్గానికి మధ్య మాటల యుద్ధం..
కాంగ్రెస్ పార్టీలో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో నిన్న కాంగ్రెస్ సీనియర్ నేతలంతా సమావేశమై.. సేవ్ కాంగ్రెస్ అంటూ.. అలాగే వలస వాదులు అంటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో నిన్న కాంగ్రెస్ సీనియర్ నేతలంతా సమావేశమై.. సేవ్ కాంగ్రెస్ అంటూ.. అలాగే వలస వాదులు అంటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు తాజాగా రేవంత్ రెడ్డి వర్గం కూడా వారిపై మాటల యుద్ధానికి దారి తీసింది. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోతే సేవ్ కాంగ్రెస్ గుర్తు రాలేదా..?.. సీనియర్లను సంప్రదించకుండానే ఏఐసీసీ ఈ కమిటీలు వేసిందా..? టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే తపెంటి అంటూ రేవంత్ వర్గం ప్రశ్నిస్తుంది. అలాగే.. 2018లో టీడీపీతో పొత్తుపై లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? అమిత్ షాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలవడాన్ని ఎలా చూడాలి..? భట్టి గతంలో కేసీఆర్ ను కలిశారు కదా.. దాన్నెలా చూడాలి..? ఎమ్మెల్యేలు పార్టీని వీడితే దానికి భట్టి బాధ్యత లేదా..? అంటూ రేవంత్ రెడ్డి వర్గం నాయకులు సేవ్ కాంగ్రెస్ నేతలకు ప్రశ్నల వర్షం కురిపించారు.