ఎట్టిపరిస్థితుల్లో జరగనివ్వం.. దసరా వేళ VHP సంచలన ప్రకటన

దసరా(Dussehra) పండుగ వేళ విశ్వహిందూ పరిషత్(VHP) పరిషత్ నాయకులు సంచలన ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-10-12 03:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: దసరా(Dussehra) పండుగ వేళ విశ్వహిందూ పరిషత్(VHP) పరిషత్ నాయకులు సంచలన ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా నేడు(శనివారం) జరుగబోయే భారత్, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌ను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా.. ఓడినా బాధితులు మాత్రం బంగ్లాదేశ్‌లోని హిందువులే అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను ప్రమాదంలోకి నెట్టొద్దని అన్నారు. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. టీ20 మ్యాచ్‌ నిమిత్తం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసేందుకు టీమిండియా ప్రయత్నిస్తుంది. మరోవైపు ఈ మ్యాచులోనైనా కట్టడి చేయాలని బంగ్లా జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో వీహెచ్‌పీ హెచ్చరికలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.



 



Similar News