తెలంగాణ పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం.. పవన్ కల్యాణ్‌తో టీ- బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి భేటీ..!
తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను ఇంటికి పంపిస్తామని చెబుతున్న టీబీజేపీ తాజాగా జనసేన అధినేత పవన్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను ఇంటికి పంపిస్తామని చెబుతున్న టీబీజేపీ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఈ మేరకు బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌లు సమావేశం అయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి తెలంగాణలో పోటీ చేసే అవకాశాన్ని వదులుకోవద్దని తెలంగాణ జనసేన నేతలు నిన్న రాత్రి జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను కోరారు.
జనసేన పోటీ చేయబోయే 32 స్థానాలను ఇప్పటికే పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ ముఖ్యనేతలు పవన్ వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తులు, పోటీ చేసే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పొత్తుల వరకు అయితే పర్వాలేదు కానీ మద్దతు అంటే కుదరదని తేల్చి చెప్పాలని పవన్‌పై తెలంగాణ జనసేన నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.