పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి.. హైడ్రాపై సీఎంకు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. ఆ లేఖలో ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి. కానీ మీరు, మీ ప్రభుత్వం కూల్చివేత తో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రా పేరుతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. నగరంలో నిర్మాణాలకు ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు అక్రమం అంటే ఎలా అని ప్రశ్నించారు. అలాగే ఇలా ఏకపక్షంగా ప్రజల ఇళ్లను కూలగొడితే.. పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి అని సీఎంను కిషన్ రెడ్డి తన నిలదీశారు. జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎండీఏ(HMDA) అధికారులు ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా(HYDRAA) ఎలా చెబుతోందన్నారు. అలాగే గత ప్రభుత్వాలు పేదల కోసం అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేశాయని గుర్తు చేశారు. హైడ్రా అధికారులు, ప్రభుత్వం కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలని.. ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలని కిషన్ రెడ్డి (Kishan Reddy)తన లేఖలో రాసుకొచ్చారు.