కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేనా? సన్నాహక సమావేశంలో భట్టీ, ఏపీ మంత్రి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని గత ప్రభుత్వం విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని గత ప్రభుత్వం విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర బడ్జెట్ 2024-25 సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సారి అయిన తెలంగాణకు న్యాయం జరిగేనా? అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే, శనివారం న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ హాజరయ్యారు.
ఈ ఆర్థిక సంవర్సానికి సంబంధించి సార్వత్రిక ఎన్నకల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నారు. సన్నాహక సమావేశాల్లో బడ్జెట్ రూపకల్పనపై హాజరైన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మాలా సీతారామన్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చలు చేయనున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను వేయాలన్న కమిటీ సిఫార్సులపై చర్చించే అవకాశం ఉంది.
కాగా, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు రావాల్సిన వాటపై విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టులు సాధనకు కృషి చేయాలని సీఎం వారిని కోరారు.