రాహుల్ వైట్ ఛాలెంజ్‌కి సిద్ధమా? టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు హల్‌చల్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 'వైట్ ఛాలెంజ్' స్వీకరించాలని
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 'వైట్ ఛాలెంజ్' స్వీకరించాలని సవాల్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణలో రాహుల్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లోని పలుప్రాంతాల్లో ' రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా ?' అంటూ ప్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. మంత్రి కేటీఆర్ వైట్ ఛాలెంజ్ లో భాగంగా టెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు...మీరు సిద్ధమా' అంటూ టీఆర్ఎస్ నాయకుడు క్రిషన్ రాహుల్‌కు సవాల్ విసిరారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్‌పై యువతకు అవగాహన కల్పించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ 'వైట్ ఛాలెంజ్' ప్రారంభించారు. డ్రగ్స్ రాకెట్‌తో కేటీఆర్‌కు సంబంధం ఉందని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సొంత పార్టీనేత రేవంత్ పెట్టిన వైట్ ఛాలెంజ్‌ను రాహుల్ గాంధీ ఎందుకు స్వీకరించడం లేదని టీఆర్‌ఎస్ నేత క్రిషన్ ప్రశ్ని్ంచారు. ప్రస్తుతం వైట్ ఛాలెంజ్ ప్లెక్సీలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, రాహుల్ రాజకీయాల కోసమే తెలంగాణకు వస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఖాట్మండులోని ఒక నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ వైరల్ వీడియోలో కనిపించిన తర్వాత టీఆర్‌ఎస్ 'వైట్ ఛాలెంజ్' విసిరింది. ఇది బీజెపి, కాంగ్రెస్ మధ్య భారీ మాటల యుద్ధానికి దారితీసింది.