First Elected Chief Minister : తెలంగాణ గడ్డపై తొలి సీఎం.. బూర్గుల వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ సందేశం

స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు.

Update: 2024-09-14 05:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక సందేశం విడుదల చేశారు. నిస్వార్థ నాయకుడిగా, తెలంగాణ గడ్డపై ప్రజలు ఎన్నుకున్న తొలి ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహా వ్యక్తి బూర్గుల అని, విలువలతో కూడిన వారి జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కాగా, బూర్గుల రామకృష్ణారావు మార్చి 13, 1899 మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, కవి, రచయిత, న్యాయవాది. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు. సెప్టెంబర్ 14, 1967లో తుదిశ్వాస విడిచారు.


Similar News