Traffic Alert: వాహనదారులకు బిగ్ అలర్ట్.. వారం పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..!

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కీలక సూచన చేశారు.

Update: 2024-10-24 03:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కీలక సూచన చేశారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నట్లుగా పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ (GHMC) ఎస్‌ఆర్‌డీపీ (SRDP) అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్‌ (Shilpa Layout) ఫేజ్‌-2 పరిధిలో నూతనంగా ఫ్లై ‌ఓవర్‌‌‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ (Gachibowli Fly over)ను వారం రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వెల్లడించారు.

ఈ మేరకు మంగళవారం నుంచి ఈ నెల 28 రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్ (Cyberabad Traffic Joint CP Joel Davies) తెలిపారు. అయితే, ఆ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్నామ్నాయం చూసుకోవాలని సూచించారు. కాగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిల్పా లేఅవుట్‌లోని ఫేజ్-2 ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 


Similar News