అత్యాచారానికి గురైన చిన్నారిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్మన్

హైదర్ నగర్ రెయిన్బో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బౌరంపేటలో అత్యాచారానికి గురైన చిన్నారిని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద బుధవారం పరామర్శించారు.

Update: 2024-10-23 17:30 GMT

దిశ, శేరిలింగంపల్లి: హైదర్ నగర్ రెయిన్బో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బౌరంపేటలో అత్యాచారానికి గురైన చిన్నారిని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద బుధవారం పరామర్శించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద అన్నారు. చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి భౌరంపే‌లో ఈ నెల 12వ తేదీన నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఇటువంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం తరపున తాము బాధితులకు అండగా ఉంటామని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద భరోసా ఇచ్చారు.


Similar News