ఇల్లీగల్ లే అవుట్ల డేటా మాయం.. హెచ్ఎండీఏ డెసిషన్‌పై సీరియస్

హెచ్ఎండీఏలో ఇల్లీగల్ లే అవుట్లు అంటూ అప్ లోడ్ చేసిన డేటా మాయమైంది. గ్రామ పంచాయతీ లే అవుట్లుగా ఉన్న వాటిపై నిషేదం విధిస్తూ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

Update: 2024-10-23 14:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏలో ఇల్లీగల్ లే అవుట్లు అంటూ అప్ లోడ్ చేసిన డేటా మాయమైంది. గ్రామ పంచాయతీ లే అవుట్లుగా ఉన్న వాటిపై నిషేదం విధిస్తూ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వెబ్ సైట్ నుంచి వివరాలను పూర్తిగా తొలగించారు. ‘దిశ’లో 21న ‘548 లే అవుట్లు ఇల్లీగల్.. రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ హెచ్ఎండీఏ నిర్ణయం’, 23న ‘హెచ్ఎండీఏ డెసిషన్‌పై రియల్టర్ల ఆగ్రహం.. 548 లే అవుట్లు ఇల్లీగల్ పై ఆరా’ అనే శీర్షికలతో వచ్చిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. వరుస కథనాలకు సీఎం కార్యాలయం నుంచి ఎంక్వయిరీ నడిచింది. అసలు ఏ అధికారి ఈ డేటాను పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టమన్నారంటూ ఆరా తీశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికారులు తప్పును సవరించుకున్నారు. ఏ ప్రాతిపదికన వీటిని అక్రమ లే అవుట్లుగా గుర్తించారన్న ప్లాట్ల యజమానుల ప్రశ్నలకు హెచ్ఎండీఏ అధికారుల దగ్గర సమాధానం లేదు.



పైగా నిషేదం విధిస్తున్నామంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. మంత్రి, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సూచనలు లేకుండానే పంచాయతీ లే అవుట్లన్నీ ఇల్లీగల్ అని ఎలా నిర్ధారణకు వచ్చారన్న అనుమానాలు తలెత్తాయి. 30 ఏండ్ల క్రితమే వెలిసిన కాలనీలపై నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలేమిటని రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ కొన్నింటినీ జాబితాలో పేర్కొనలేదు. కొన్నింటికే జాబితా పరిమితం కావడం అనుమానాలకు దారి తీసింది. ఈ గందరగోళం నేపధ్యంలోనే ప్లాట్ల యజమానులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు, హెచ్ఎండీఏ కార్యాలయానికి క్యూ కట్టారు. వేలాది మంది ఆగ్రహం వ్యక్తం చేయడంతో డేటాను తొలగించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..