Raja Singh: మీకు గులాంగిరీ చేసేటోళ్లకే పోస్టులు, టికెట్లా.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad MLC Election-2025) ఎన్నికల్లో బీజేపీ సమరశంఖం పూరించింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad MLC Election-2025) ఎన్నికల్లో బీజేపీ సమరశంఖం పూరించింది. ఈ మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థిగా సీనియర్ నేత గౌతమ్ రావు (Gautam Rao) పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై బీజీపీ సీనియర్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh), రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎంత ముఖ్య నాయకుడైతే మాత్రం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాని (Secunderabad Lok Sabha Constituency)కి చెందిన వారికే అవకాశం ఇస్తారా.. అని ప్రశ్నించారు. మిగతా పార్లమెంట్ల పరిధిలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇంకెవరూ కంటికి కనిపించలేదా అని ఫైర్ అయ్యారు. మీకు గులాంగిరీ చేసేటోళ్లకే పోస్టులు, టెకెట్లను పంచిపెడతారా అంటూ రాజాసింగ్ (Raja Singh) తీవ్రం అసహనం వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవలే ఆయన రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి నిఖార్సైన పార్టీ నేతలకు మాత్రమే ఇవ్వాలని కేంద్ర అధినాకయత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BJP) నేతలతో రహస్యంగా సమావేశాలు అయ్యే వారికి ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ కామెంట్ చేశారు. పార్టీ అధ్యక్షుడి కోసం పని చేసే వారికి కాకుండా.. పార్టీకి, కార్యకర్తల కోసం పనిచేసే వారికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే.. బాగుంటుదని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.