తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మంత్రి పొంగులేటి ప్రకటన

వీఆర్‌వోలపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది.

Update: 2024-10-24 03:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: వీఆర్‌వోలపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Panguleti Srinivasa Reddy) ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో వీఆర్‌వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వం వ్యవస్థను ధ్వంసం చేసిందని అన్నారు. అందుకే వీఆర్‌వో వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని తెలిపారు. అంతేకాదు.. ధరణి పోర్టల్ పేరును కూడా మార్చుతున్నారని కీలక ప్రకటన చేశారు. ధరణి పేరుతో ఇష్టానుసారం దోచుకున్నవారిని తప్పకుండా జైలుకు పంపుతామని కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలే అవకాశముందని పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులు, అధికారుల బ్రందం సియోల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఆ బాంబులు పేలే అవకాశం ఉందని అన్నారు. ధరణి, కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ఇలా 10 అంశాల వారీగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై తొందరపాటుతో కాకుండా.. కక్షపూరితమైన చర్యలకు పోకుండా సరైనా సాక్షాధానాలతో చర్యలు తీసుకుంటాం. అందులో ప్రధాన నాయకులే ఉంటారు. ప్రజలు కోరుకున్న వార్తలు తప్పకుండా వినబోతున్నారు అంటూ మంత్రి పొంగులేటి హెచ్చరించారు.

Tags:    

Similar News