BIG BREAKING: విద్యుత్ వినియోగదారులకు గూడ్ న్యూస్.. ఛార్జీల పెంపుపై డిస్కం సీఎండీ సంచలన ప్రకటన

రాష్ట్రంలో ప్రభుత్వం కరెంట్ చార్జీల పెంచబోతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ (DISCOM CMD Musharraf Farooqui) స్పందించారు.

Update: 2024-10-24 04:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం కరెంట్ చార్జీల పెంచబోతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ (DISCOM CMD Musharraf Farooqui) స్పందించారు. ఈ మేరకు ఆయన సామాన్య ప్రజలపై చార్జీల భారం మోపడం లేదని స్పష్టం చేశారు. ఇంకా కరెంట్ చార్జీల పెంపు విషయంలో తాము ఎలాంటి ప్రకటన చేయలేదని.. మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అంటూ కొట్టి పాడేశారు.

కాగా, సదరన్​ డిస్కం ప్రతిపాదించిన విద్యుత్ యాగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్స్ (Aggregate Revenue Requirements)పై విద్యుత్​ నియంత్రణ మండలి (Electricity Regulatory Board) చైర్మన్ శ్రీరంగరావు అధ్యక్షతన బుధవారం బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​‌తో ఏఆర్ఆర్ ప్రతిపాదనలను ముషారఫ్ ఫారూఖీ సమగ్రంగా వివరించారు. హై టెన్షన్ (హెచ్‌టీ 11కేవీ) వినియోగదారులపై చార్జీల భారం పడదని ఆయన పేర్కొన్నారు. నెలకు 300 యూనిట్లకు పైగా కరెంట్ వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు ఫిక్స్‌డ్​చార్జీల రూపంలో రూ.50 పెంచాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదించామని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. 


Similar News