Tirumala Samacharam: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. ప్రధాన కారణం అదే?

ఆపద మొక్కలు వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది.

Update: 2024-10-24 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కలు వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగానే సమయం పడుతోంది. అదేవిధంగా గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 64,447 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,555 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.38 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర వ్యా్ప్తంగా తుఫాన్ (Cyclone) హెచ్చరికల నేపథ్యంలో తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో సామాన్య భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉండకుండానే సులువుగా శ్రీవారి దర్శనం అవుతోంది. మరోవైపు తుఫాన్ ఎఫెక్ట్‌తో 200లకు రైళ్లు రద్దు అవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి ప్రధాన కారణమని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చుట్టుపక్కల జిల్లాల నుంచి మాత్రమే స్వామి వారి దర్శనానికి భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.


Similar News