Budhaditya Yoga: బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

సూర్యుడు ప్రతి నెల సంచారం చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే

Update: 2024-11-22 13:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : సూర్యుడు ప్రతి నెల సంచారం చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. గ్రహాలకు అధిపతిగా ఉండే సూర్యుడు, అంగారకుడు పాలించే రాశిలోకి సంచారం చేయనున్నాడు. అయితే, అదే రాశిలో బుధుడు కూడా వృశ్చిక రాశిలోకి ఉన్నాడు. దీని కారణంగా ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి. బుధుడు, సూర్య గ్రహాలు ఒకే రాశిలో కలవడం వలన బుధాదిత్య యోగం ( Budhaditya Yoga ) చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా, రెండు రాశుల వారికీ అనుకూలంగా ఉండనుంది.ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మకర రాశి

మకర రాశివారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు పని చేసే ఆఫీసులో జీతంతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది. అలాగే, ఈ సమయంలో పూజలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది.   

తులా రాశి

తుల రాశి వారికి బుధాదిత్య యోగం అన్నీ రకాలుగా కలిసి వస్తుంది. అంతేకాకుండా, కొత్తగా వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి. ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News