రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న పోలీసుల భార్యలు.. రీజన్ ఏంటో తెలుసా?

తెలంగాణలో పోలీసుల(Telangana Police) భార్యలు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాలోని 17th బెటాలియన్ ఎదుట పోలీసుల భార్యలు గురువారం ధర్నా నిర్వహించారు.

Update: 2024-10-24 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పోలీసుల(Telangana Police) భార్యలు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాలోని 17th బెటాలియన్ ఎదుట పోలీసుల భార్యలు గురువారం ధర్నా నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి డ్యూటీకి చేస్తున్న పనికి సంబంధం లేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడే పోలీస్‌ వ్యవస్థలో ఏక్‌ పోలీస్‌ విధానాన్ని అనుసరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. శాంతి భద్రతల కోసం రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ కానిస్టేబుళ్లు వెట్టిచాకిరీ చేస్తున్నా.. వారి కుటుంబాల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. విధి నిర్వహణ పేరుతో ప్రభుత్వం వారిని కుటుంబాలకు దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఒకే పోలీస్‌ విధానం ఉండాలనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.

Tags:    

Similar News