Cyber Crime: సైబర్ క్రైం వలలో చిక్కుకున్న జగిత్యాల యువకులు.. న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు

ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు.

Update: 2024-10-24 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం దాదాపుగా అన్ని దేశాల్లో డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) అందుబాటులోకి రావడంతో క్యాష్ పేమెంట్స్ (Cash Payments) పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు ఆన్‌లైన్ పేమెంట్స్ (Online Payments) చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) నయా దందాకు తెర లేపారు. తాజాగా, ఓ ఏజెంట్ బారిన పడి లావోస్ దేశం(Laos Country)లో జగిత్యాల (Jagityala) యువకులు సైబర్ క్రైం వలలో చిక్కుకున్నారు.

లావోస్‌ (Laos)లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నలుగురు యువకుల నుంచి వంశీ అనే ఏజెంట్ రూ.2 లక్షల చొప్పున వసూలు చేశాడు. అనంతరం వారిని లావోస్‌ (Laos)లోని ఓ కంపెనీలో బిట్ కాయిన్ సెల్స్ అండ్ ప్రమోటింగ్ (Bitcoin Sale and Promoting) పేరుతో పనిలో పెట్టాడు. అయితే, అక్కడున్న బాస్ ఆన్‌లైన్‌లో క్లయింట్స్‌తో చాట్ చేసి వాళ్ల బ్యాంక్ అకౌంట్స్‌ను జీరో చేయడమే వారి జాబ్ అని చెప్పారు. దీంతో అవాక్కైన యువకులు అక్కడి నుంచి ఎలాగైనా బయట పడాలని నిర్ణయించుకున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు భోజనం లేక పస్తులు ఉన్నామని బాధిత యువకులు పేర్కొన్నారు. ఎట్టకేలకు ఏపీకి చెందిన ఓ వ్యక్తి సాయంతో ఈ నెల 7న వారు హైదరాబాద్‌ (Hyderabad) నగరానికి చేరుకున్నారు. అయితే, ఉద్యోగాల పేరుతో తమను మోసం చేసిన ఏజెంట్ వంశీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బాధిత యువకులు ఫిర్యాదు చేశారు.


Similar News