TS: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో మరో ముందడుగు

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

Update: 2023-01-26 06:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జీవో 5ను జారీ చేశారు. రేపటి నుంచి టీచర్ల ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ మొదలవుతుందని, దరఖాస్తులను ఈనెల 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న బదిలీల ప్రక్రియ మార్చి 4వ తేదీతో ముగియనుంది. దరఖాస్తుల హార్డ్ కాపీలను హైస్కూల్ టీచర్లు హెడ్మాస్టర్లు, ఎంఈవోలకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు అందించాల్సి ఉంటుంది. తమకు అందిన అప్లికేషన్లను హెడ్మాస్టర్లు, ఎంఈవోలు ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు డీఈవో కార్యాలయంలో సమర్పణ, పరిశీలన, ఆన్ లైన్‌లో ఆమోదం జరుగుతాయి.

ఫిబ్రవరి 7న డీఈవో, ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీలు, పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 11.12 తేదీల్లో సీనియారిటీకి సంబంధించి తుది ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 13న మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన చేపడతారు. ఫిబ్రవరి 14 ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహణ జరుగుతుంది. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్​జీటీ తత్సమాన పోస్టుల ఖాళీలు ప్రకటించి వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారు. మార్చి 4న ఎస్​జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేసి.. మార్చి 5 నుంచి 19 వరకు డీఈవో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపాల్సి ఉటుంది. కాగా ఓ వైపు స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్.. 317 జీవో రద్దు కోసం డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో టీచర్ల ఆందోళనలు కొనసాగిస్తుంటే మరోవైపు ప్రభుత్వం బదిలీలకు సంబంధించి జీవో విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read....

బాసరలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు 

Tags:    

Similar News