TPCC: కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
అదానీ(Adani)పై జేపీసీ విచారణ, మణిపూర్(Manipur)లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మోడీ(Modi) ప్రభుత్వ వైఖరి
దిశ, వెబ్‌డెస్క్: అదానీ(Adani)పై జేపీసీ విచారణ, మణిపూర్(Manipur)లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మోడీ(Modi) ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ(AICC) పిలుపు మేరకు టీపీసీసీ(TPCC) ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టామని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. బుధవారం మండలి వద్ద మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ అండదండలతో అదానీ దేశంలోని వ్యవస్థలను, బ్యాంకులను మభ్య పెడుతున్నారని అన్నారు.
మోడీ 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి అదానీ విమానాన్ని వాడుకున్నారని ఆరోపించారు. అదానీ(Adani) స్కాములతో దేశ ప్రతిష్ట మసకబారుతోందని అన్నారు. ఆయన కుంభకోణాలపై ఎన్డీఏ ప్రభుత్వం జేపీసీ వేయడానికి ఎందుకు జంకుతుందని ప్రశ్నించారు. జాతి వివక్షతతో మణిపూర్ రాష్ట్రం తగలబడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. మణిపూర్ అల్లర్లను అరికట్టలేక మోడీ మౌనంగా ఉండిపోయారని ఎద్దేవా చేశారు. మణిపూర్ ఘటన తర్వాత మోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రంలో పర్యటించలేదని అన్నారు.