MLC Balmuri : తప్పు చేసినందుకే కేటీఆర్ కు జైలు భయం : ఎమ్మెల్సీ బల్మూరి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు తప్పు చేసినందునే జైలు భయం పట్టుకుందని..అందుకే పదేపదే అరెస్టు చేస్తారని..జైలుకెలుతా అని కలవరిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) ఎద్దేవా చేశారు.

Update: 2024-12-18 09:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు తప్పు చేసినందునే జైలు భయం పట్టుకుందని..అందుకే పదేపదే అరెస్టు చేస్తారని..జైలుకెలుతా అని కలవరిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే కేటీఆర్ పైన చట్టపరంగా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పదన్నారు. కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే పదే పదే జైలుకు వెళ్తా అని ఎందుకు అంటున్నాడని ప్రశ్నించారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని....తప్పు చేసినట్లు తేలితే తప్పకుండా కటకటాల పాలవుతారన్నారు. ముందు కేటీఆర్ తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జైలుకెళ్లే ఆలోచనతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బావబావమర్థులు సంకెళ్లతో నిరసన చేయించారని, అందులోనూ వారు మాత్రం సంకెళ్లు వేసుకోలేదన్నారు. తనను అరెస్టు చేస్తే శాంతిభద్రతల సమస్య సృష్టించాలని బీఆర్ఎస్ శ్రేణులను కేటీఆర్ రెచ్చగొడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ముందు పదేళ్ల వాళ్ల పాలన ఎలా సాగిందో బీఆర్ఎస్ నేతలు గుర్తుచేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ కు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే వారు చెప్పే అంశాలపై రాద్దాంతం మాని అసెంబ్లీ బిజినెస్ ఎజెండా మేరకు ప్రభుత్వం పెట్టిన అంశాలపై చర్చల్లో పాల్గొనాలని సూచించారు. 

Tags:    

Similar News