Seethakka: గతంలో కేసీఆర్ మనవడే అన్నాడు.. మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు(Ministers) సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ ఎమ్మెల్యే(Karimnagar MLA) గంగుల కమలాకర్(Gangula Kamalakar) గురుకులాల గురించి మాట్లాడుతూ.. విద్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తరగతులు వెనుకబడి ఉన్నారని, వారికి సరైన సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. దీనికి మంత్రి సీతక్క(Minister Seethakka) సమాధానం ఇస్తూ.. తెలంగాణలో వెనుకబడిన తరగతులను విస్మరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని(BRS Government), తమ పాలనలోనే విద్యావ్యవస్థ(Education) నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు. అంతేగాక ఇది నేను చెప్పిన మాట కాదని, మీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు స్వయంగా విద్యాశాఖ మంత్రి ముందే అన్నారని గుర్తు చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రితో పాటు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కేటీఆర్ కుమారుడు.. ఇది స్కూలేనా? అని ముక్కు మూసుకున్నారని కౌంటర్ ఇచ్చారు. అలాంటిది విద్యా వ్యవస్థ గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం తగదని సీతక్క అన్నారు.