TPCC: హరీష్ రావు కేసీఆర్‌ను అసెంబ్లీకి రాకుండా చేస్తున్నాడు.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
సభలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్(Drunk And Drive Test) చేస్తే కేసీఆర్(KCR) ఇంకెప్పటికీ అసెంబ్లీ(Telangana Assembly)కి రాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President jaggareddy) కామెంట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: సభలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్(Drunk And Drive Test) చేస్తే కేసీఆర్(KCR) ఇంకెప్పటికీ అసెంబ్లీ(Telangana Assembly)కి రాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President jaggareddy) కామెంట్ చేశారు. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని అన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) మాటలకు జగ్గారెడ్డి స్పందిస్తూ.. బీఆర్ఎస్ నేతలకు(BRS Leaders) కౌంటర్(Counter) ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సభలో డ్రంక్ అండ్ డ్రైవ్ మెషిన్లు పెట్టడానికి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఎలాంటి సమస్య లేదని, ఎలాగో ఆయనకు తాగుడు అలవాటు లేదని చెప్పారు. వచ్చిన సమస్య అంతా హరీష్ రావు, కేసీఆర్ లకేనని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను అసెంబ్లీకి ఎంత రమ్మన్నా రావట్లేదని, ఈ టెస్ట్ లు పెడుతున్నారని తెలిస్తే మొత్తానికే రావటం మానేస్తాడని చెప్పారు. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే బీఆర్ఎస్ కే నష్టమని, కాంగ్రెస్(Congress) కు ఎలాంటి నష్టం లేదని జగ్గారెడ్డి తెలిపారు.