BRS: ఇది రైతుల విజయం.. లగచర్ల నిందితులకు బెయిల్ రావడంపై కేటీఆర్
ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో(Congress Government) పోరాడిన రైతుల విజయమని(Victory) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో(Congress Government) పోరాడిన రైతుల విజయమని(Victory) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. లగచర్ల ఘటనలో(Lagacharla Incident) నిందితులుగా ఉన్న వారికి హైకోర్లు(High Court) షరతులతో కూడిన బెయిల్(Conditional Bail) మంజూరు చేసింది. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కొడంగల్(Kodangal) రైతులకు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Former MLA Patnam Narendar Reddy)కి 35 రోజుల వేదన తర్వాత ఉపశమనం లభించిందని తెలిపారు.
వీరంతా అదానీ(Adani) సిమెంట్ ప్లాంట్ కోసం, ఆయన బంధువుల ఫార్మా కంపెనీల(Farma Company) కోసం భూములు సేకరించేందుకు రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం చేస్తున్న బలవంతపు చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారని అన్నారు. ఇది అణిచివేత కాంగ్రెస్ ప్రభుత్వంపై ధీటుగా పోరాడిన కొడంగల్ రైతుల విజయం అని కేటీఆర్ రాసుకొచ్చారు. కాగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మాసిటీ కోసం భూసేకరణకై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి సహా దాడిలో పాల్గొన్న వ్యక్తులను అరెస్ట్ చేశారు.