Deepak John: క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.. దీపక్ జాన్ కొక్కడన్

క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-12-18 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతున్నారన్నారు. ముఖ్య అతిథులతో పాటు ఇతర ప్రముఖులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ అధికారులకు సూచించారు. ఎల్బీ స్టేడియంలో ఎస్ఎల్ఓసీ సభ్యులు, పోలీస్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, సమాచార, విద్యుత్, టీజీఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకోవా లన్నారు.

వేడుకల కోసం రాష్ట్రస్తాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 200 ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో 95 చోట్ల వేడుకలు నిర్వహిస్తు న్నట్టు వెల్లడించారు. వేడుకలలో పాల్గొనే క్రైస్తవ లందరి కోసం 100 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. వేడుకల నిర్వహణ సందర్బంగా మూడు రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోని అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసుకుంటూ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ ఎండీ. క్రాంతి వెస్లీ, సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ హారీష్, ఉద్యాన వన శాఖ సంచాలకులు యాస్మిన్ భాష, క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ. సబిత, పోలీస్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, సమాచార శాఖ అదనపు సంచాలకులు డీఎస్ జగన్, మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్, ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఇతర శాఖల అధికారులు, ఆర్గనైజర్ సైదా, ఎస్ఎల్ ఓసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News