Kishan Reddy : రేవంత్ రెడ్డి తీరు గురివింద గింజలా ఉంది : కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నిరాశలో కూరుకుపోయిందని అన్నారు. మహారాష్ట్ర(Maharashtra), హరియాణా(Hariayana) ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదన్నారు. ప్రధాని కావాలనే రాహుల్ గాంధీ(Rahul Gandhi) కల నెరవేరక పోవడం వల్లే, ఏం చేయాలో తెలియక పిచ్చిపట్టినట్టు మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. అసలు రాహుల్ కు ప్రజా సమస్యలపై అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీరు గురివింద గింజలా ఉందన్న కిషన్ రెడ్డి.. అదానీ(Adani)తో మా పార్టీకి ఏదో సంబంధం ఉందన్న ఆయన.. అదే అదానీతో వాణిజ్య ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు.