హైదరాబాద్ యువకుడికి 50 మంది భార్యలు.. విగ్గుకో వివాహం అంటూ..

మోసానికి కాదేది అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు కొందరు మాయగాళ్లు. రోజుకో వేషం మార్చి.. మాటలతో ఏమార్చి చీటింగ్ చేస్తున్నారు.

Update: 2024-12-18 12:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మోసానికి కాదేది అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు కొందరు మాయగాళ్లు. రోజుకో వేషం మార్చి.. మాటలతో ఏమార్చి చీటింగ్ చేస్తున్నారు. అందినకాడికి కొట్టేసి.. మరో బకరాను వెతుక్కుంటున్నారు. ఇదే మాదిరిగా ఓ యువకుడు పెళ్లి పేరుతో 50 మంది యువతులను మోసం చేసి తెలంగాణలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన వంశీకృష్ణ మ్యాట్రిమోనిలో తన అందమైన ఫొటోలతో ప్రొఫైల్ పెట్టాడు. తానో సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా పేర్కొన్నాడు. ఇలా పెళ్లి కాని యువకుడిగా ఫొజులు కొడుతూ వరుడి కోసం ఎదురు చూసే అమ్మాయిలకు తన ప్రొఫైల్‌ను పంపుతాడు. అలా పెళ్లి పేరిట లక్షల్లో కట్నాలు తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. రోజుకో విగ్గు పెట్టుకోని రూపం మారుస్తూ నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. 

తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువ డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ప్రొఫైల్ పంపి ఆమె తల్లిదండ్రులతో కట్నకానుకలు మాట్లాడున్నాడు. ఆ లేడీ డాక్టర్ నుంచి రూ.40 లక్షల కాజేసి ముఖం చాటేశాడు. యువతి తల్లిదండ్రులు డబ్బులు అడిగితే మీ అమ్మాయి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన పేరెంట్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విగ్గుల పెళ్లి కొడుకు మోసాలు బయటపడ్డాయి. అంతేకాదు.. ఇలా నిత్య పెళ్లి కొడుకుగా మారి 50 మంది యువతుల తల్లిదండ్రులను మోసం చేశాడని, పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడని పోలీసులు గుర్తించారు. అతడికి పెళ్లై, భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసింది. గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ తదితర ఖరీదైన ప్రాంతాల్లో ఉంటూ సినీ, రాజకీయ ప్రముఖులతో ఫొటోలు దిగి వారితో దగ్గర సంబంధాలు ఉన్నట్లు నమ్మబలుకుతున్నాడు. తను మోసం చేయాలనుకునే అమ్మాయి కులగోత్రానికి అనుగుణంగా పేరు మార్చుకోని, విగ్గు పెట్టుకోని కొత్త ప్రొఫైల్‌తో ఛీటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కేవలం తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ ఈ విగ్గుల పెళ్లి కొడుకు తన పని తనాన్ని చూపించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Tags:    

Similar News