అంతర్రాష్ట్ర యువకుడి దారుణ హత్య..

వరంగల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో

Update: 2024-12-18 14:18 GMT

దిశ, వరంగల్ : వరంగల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బీహార్ రాష్ట్రానికి చెందిన దిల్ కుష్ కుమార్(18) అనే యువకుడి హత్య కలకలం రేపింది. దిల్ కుష్ కుమార్ అతని సోదరుడు దులాల్ చందు వీరిద్దరితో పాటు మరికొందరు గృహ నిర్మాణ పనుల కోసం బీహార్ రాష్ట్రంలోని కాగారియా ప్రాంతం నుంచి వరంగల్ వచ్చి నగరంలోని కరీమాబాద్ పుట్నాల మిల్లు సమీపంలో కిరాయి ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి దులాల్ చందు తన మిత్రులను వరంగల్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కించి తన ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తన తమ్ముడు దిల్కుష్ కుమార్ ఇంట్లో రక్తపు మడుగులో కనిపించాడని పోలీసులకు తెలిపారు.

అయితే మంగళవారం రాత్రి కరీమాబాద్ కు చెందిన మరి కొందరు ఇంటి నిర్మాణ పనులు చేసే వ్యక్తులు, బీహార్ కు చెందిన యువకుల మధ్య ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని కీర్తి బార్ వద్ద గొడవ జరిగిందని, వారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులతో దులాల్ చంద్ అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని ఏసిపి నంది రాం నాయక్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం పరిశీలించి గొడవ పడిన వ్యక్తులు చేసుంటారా, ఇంకెవరైనా చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.


Similar News