రాంగ్ రూటే యువకుడి ప్రాణం తీసిందా...?

రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా

Update: 2024-12-18 16:33 GMT

దిశ,గజ్వేల్ రూరల్ : రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్డులో దొంతుల గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పిట్ల కరుణాకర్ తన బైక్ పై గజ్వేల్ నుంచి గ్రామానికి వెళ్తుండగా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎర్రవల్లి గ్రామానికి చెందిన మన్నెం కరుణాకర్ రెడ్డి తన బైక్ పై ఆర్ అండ్ ఆర్ కాలనీ నుంచి గజ్వేల్ కి రాంగ్ రూట్‌లో వెళుతుండగా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్డులో ఉన్న దొంతుల గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయని తెలిపారు.

ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వీరిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పిట్ల కరుణాకర్ ని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. మన్నెం కరుణాకర్ రెడ్డిని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుడు పిట్ల కరుణాకర్ కి తల్లి, భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గజ్వేల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News