అక్రమంగా తరలిస్తున్న కలప ట్రాక్టర్ పట్టివేత

రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్డు వద్ద ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

Update: 2024-12-18 15:38 GMT

దిశ, రామడుగు : రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్డు వద్ద ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే గంగాధర మండలం కురిక్యాల శివారు ప్రాంతాల్లో కలపను పోగుచేసి రామడుగు మండలం మీదుగా చొప్పదండికి తరలిస్తుండగా ఫారెస్ట్ స్ట్రైక్ ఆఫీసర్ వేణుగోపాల్ తో పాటు మండల అధికారిణి లత వెదిర ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. కాగా చొప్పదండిలో వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి ఫోన్ లో అధికారులతో మాట్లాడడంతో ట్రాక్టర్​ను వదిలి వేశారు. దీనిపై దిశ విలేఖరి అధికారులను వివరణ కోరగా రేపు యజమానులను విచారించనున్నట్టు తెలిపారు. 


Similar News