పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి పాముకాటు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని పాముకాటు వేసింది.

Update: 2024-12-18 16:26 GMT

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని పాముకాటు వేసింది. విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి పట్టణానికి చెందిన అఖిల్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

    బుధవారం ఉదయం తనకు చెయ్యి నొప్పి ఉందని ఉపాధ్యాయులకు చెప్పడంతో విద్యార్ధి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు విద్యార్థిని హుటా హుటిన కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే డాక్టర్లు పాముకాటుగా గుర్తించి చికిత్స అందిస్తున్నారని అఖిల్ తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.


Similar News