క్యాండిల్ అంటుకొని మహిళ మృతి

ఇంట్లో కరెంట్ లేకపోవడంతో వెలిగించిన క్యాండిల్ అంటుకొని మంటలు చెలరేగడంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల్ గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-12-18 15:28 GMT

దిశ, మేడ్చల్ టౌన్ : ఇంట్లో కరెంట్ లేకపోవడంతో వెలిగించిన క్యాండిల్ అంటుకొని మంటలు చెలరేగడంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల్ గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం శామీర్ పేట్ మండలం పొన్నాల్ గ్రామంలో ఉదరి భాగ్య (40) అనే మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వెలిగించిన క్యాండిల్ బెడ్ షీట్ కు అంటుకొని భాగ్య చీరకు మంటలు చెలరేగి మృతి చెందినట్లు పోలీసులు అనుమాని స్తున్నారు. ఇంటి కరెంట్ బిల్లు కట్టకపోవడం వల్ల కరెంట్ కట్ చేయడంతో వెలుతురు కోసం క్యాండిల్ వెలిగిందిందని తెలిపారు. భాగ్య భర్త కూలి పని నిమిత్తం 15 రోజుల క్రితం కరీంనగర్ కు వెళ్లాడని చెప్పారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News