BRS: చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గం.. మాజీ మంత్రి హరీష్ రావు

జీతాలు చెల్లించకుండా చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు(BRS Leader Harish Rao) ఆరోపించారు.

Update: 2024-12-18 09:52 GMT
BRS: చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గం.. మాజీ మంత్రి హరీష్ రావు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: జీతాలు చెల్లించకుండా చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు(BRS Leader Harish Rao) ఆరోపించారు. పెసా మొబిలైజర్స్(Pesa Mobilizers) ఉద్యోగుల సమస్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిపై ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో పనిచేసే పెసా మొబిలైజర్స్ 13 నెలలుగా జీతాలు(Salaries) చెల్లించక పోవడం శోచనీయమని అన్నారు. నెలకు రూ. 4000 చొప్పున ఒక్కొక్కరికి రూ. 52,000 ఈ ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. అలాగే ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప, ఆచరణ ప్రశ్నార్థకం అవుతున్నదని, చిరు ఉద్యోగులకి కూడా జీతాలు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెట్టడం దుర్మార్గం మండిపడ్డారు. అంతేగాక పెసా మొబిలైజర్స్‌కి పెండింగ్ లో ఉన్న 13 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని, నెల నెలా జీతాలు చెల్లించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని(Congress Government) డిమాండ్ చేశారు.

Tags:    

Similar News