Harish Rao: రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ విషయం బయటపెట్టాలి

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-12-18 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం అసెంబ్లీ(Assembly) మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) నేతలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారని విమర్శించారు. రాజ్ భవన్ ముట్టడిలో కేసీఆర్(KCR) గురించి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతున్నారు. తాము రేవంత్ రెడ్డి, అదానీ(Adani) ఫొటోతో అసెంబ్లీకి వస్తే మమమ్మల్ని అడ్డుకున్నారని గుర్తుచేశారు.

అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 12 వేల కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీపై రేవంత్ రెడ్డి పోరాటం నిజమైతే ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదని అడిగారు. అదానీకి వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు 12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలని అన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ రెడ్డి అనుమతులు ఇస్తున్నారు. రోడ్లపై అదానీకి వ్యతిరేకంగా సర్కస్ ఫీట్లు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రేపు అసెంబ్లీలో అదానీ, రేవంత్ రెడ్డిల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News