BJP: కాంగ్రెస్‌కు ఆ పేరు పలికే అర్హతే లేదు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
అంబేద్కర్‌కు మాటిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) ఆరోపించారు.
దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్‌కు మాటిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) ఆరోపించారు. ఢిల్లీ(Delhi)లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Parliament Session) జరుగుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అంబేద్కర్(Dr.BR Ambedkar) ను అవమానించిందని హోంమంత్రి అమిత్ షా(Union Minister Amit Sha) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీనిపై ఆయన.. అంబేద్కర్‌ను పార్టీలో అవమానించింది కాంగ్రెస్ అని, అంబేద్కర్ పార్టీని వీడేలా అగౌరవపరిచింది కాంగ్రెస్ అంటూ.. చివరికి, "కాంగ్రెస్‌లో చేరడమంటే ఆత్మహత్య చేసుకోవడమే" అనేంతలా అణగారిన వర్గాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అంతేగాక అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లింది బీజేపీ అని, ఆయనకు స్మారకాలు నిర్మించి గౌరవించుకున్నది బీజేపీ అని, కాంగ్రెస్‌కు అంబేద్కర్ పేరులోని 'అ' కూడా పలికే అర్హత లేదని కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.