Assembly: స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి.

Update: 2024-12-18 10:57 GMT
Assembly: స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు(Harish Rao Thanneeru) సహా బీఆర్ఎస్ శాసనసభ పక్షం (BRS MLAs) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Spesker Gaddam Prasad Kumar ) ను కలిశారు. అసెంబ్లీలో ఫార్ములా ఈ రేసింగ్(Formula E Racing) అంశంపై చర్చ(Discussion) జరపాలని స్పీకర్ కు వినతి పత్రం అందజేశారు. కాగా బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్(HYD) లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. ఏసీబీ కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతోంది.

ఈ కేసులో అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో త్వరలో కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరపాలని కోరడం ఆసక్తికరంగా మారింది. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగితే.. ఫార్ములా ఈ రేసింగ్ లో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని గత ప్రభుత్వంపై కుట్రలు చేస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చనే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీకి జరిగిన డ్యామేజీలో కొంతైనా సరిదిద్దవచ్చని ప్లాన్ లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.   

Tags:    

Similar News