Bandi Sanjay : అంబేద్కర్ ను కాంగ్రెస్ మోసం చేసింది..బీజేపీ గౌరవించింది : బండి సంజయ్

రాజ్యంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌(Ambedkar)ను కాంగ్రెస్(Congress)పార్టీ మోసం చేసి అవమానిస్తే..బీజేపీ(BJP) ఆయనను గౌరవించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

Update: 2024-12-18 10:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాజ్యంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌(Ambedkar)ను కాంగ్రెస్(Congress)పార్టీ మోసం చేసి అవమానిస్తే..బీజేపీ(BJP) ఆయనను గౌరవించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు మాటిచ్చి మోసం చేసిందని, పార్టీలో అవమానించిందని సంజయ్ ఆరోపించారు. అంబేద్కర్‌ పార్టీని వీడేలా అగౌరవపరిచింది కాంగ్రెస్‌ అని, చివరికి కాంగ్రెస్‌లో చేరడమంటే ఆత్మహత్య చేసుకోవడమే అనేంతలా అణగారిన వర్గాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లింది బీజేపీ అని, ఆయనకు స్మారకాలు నిర్మించి గౌరవించుకుంది బీజేపీ అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అంబేద్కర్‌ పేరులోని 'అ' కూడా పలికే అర్హత లేదని మండి పడ్డారు.

Tags:    

Similar News