బెల్ట్‌షాప్‌లపై సమాధానం చెప్పే దైర్యం ఈ ప్రభుత్వానికి లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో బెల్ట్‌షాప్‌ల (Beltshop)సంఖ్య గణనీయంగా పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గౌడ్ (KP Vivekanand Goud) అన్నారు

Update: 2024-12-16 08:55 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బెల్ట్‌షాప్‌ల (Beltshop)సంఖ్య గణనీయంగా పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గౌడ్ (KP Vivekanand Goud) అన్నారు. సోమవారం రోజున జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మీడియా ముఖంగా మాట్లాడుతూ.. బెల్ట్‌షాప్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు బెల్టు షాపులపై అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దైర్యం లేక సభను కావాలనే ప్రభుత్వం వాయిదా వేసిందని అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలలో, నగరాలలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో బెల్ట్‌షాప్‌లను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న బెల్ట్‌షాప్‌లపై అధికారులు దాడి చేయకపోగా, ఇంకా ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) వాడకం కూడా విపరీతంగా పెరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనట్టే చూస్తుందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో మీరు తప్పించుకోవచ్చు.. కానీ రాష్ట్రంలోని ప్రజల తరుపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోందని వివేకానంద్ హెచ్చరించారు.

Tags:    

Similar News