Telangana: బీఆర్ఎస్ మరో సంచలన నిర్ణయం

అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-12-16 10:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) విధానాలకు నిరసనగా మంగళవారం రోజున తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేయాలని నిర్ణయించారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించిన విధానాలకు నిరసనగా మంగళవారం అంబేద్కర్(Ambedkar) విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.

అంతేకాదు.. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు.. అసెంబ్లీలో జరుగుతున్న బీఏసీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సభ ఎన్నిరోజులు నడుపుతారు అనేదానిపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇవ్వకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్‌ రావు(Harish Rao) వెల్లడించారు. వీరితో పాటుగా MIM నేతలు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు.

Tags:    

Similar News