Inter Board: ఇంటర్ విద్యార్థులకు BIG అలర్ట్.. పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ ఇంటర్ పరీక్షలు షెడ్యూల్(Inter Exam Schedule ) వచ్చేసింది. 2025 మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు(Inter Exams) జరుగనున్నాయి.

Update: 2024-12-16 12:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ పరీక్షలు షెడ్యూల్(Inter Exam Schedule ) వచ్చేసింది. 2025 మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు(Inter Exams) జరుగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ జరుగనున్నాయి. జనవరి 29వ తేదీన ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ ఎగ్జామ్ ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. ఇప్పటికే సిలబస్ పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టిన ఇంటర్ బోర్డు.. పరీక్షల షెడ్యూల్ ఇచ్చి రివిజన్‌కి వెళ్లే పనిలో పడింది. మరోవైపు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇవ్వడంతో తెలంగాణలో ఎప్పుడు ఇస్తారనే ఉత్కంఠకు కూడా తెరవీడింది. దీంతో వేగవంతంగా ఇంటర్ పరీక్షలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.



 


Tags:    

Similar News