TGPSC: గ్రూప్-2 పరీక్షలో కేసీఆర్, టీఆర్ఎస్‌పై ప్రశ్నలు
తెలంగాణలో ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు(Group-2 Exams) ప్రశాంతంగా ముగిశాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు(Group-2 Exams) ప్రశాంతంగా ముగిశాయి. అయితే, ఇవాళ పేపర్-3, పేపర్ -4 పరీక్షలు నిర్వహించారు. అందులో ఆసక్తికరమైన ప్రశ్నలు వచ్చాయి. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తల్లి(Telangana Thalli) గురించి ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిర్వహించిన సమావేశాలను కాలక్రమంగా అమర్చాలని అంటూ నాలుగు ఆప్షన్లతో ఒక ప్రశ్న టీజీపీఎస్సీ(TGPSC) ఇచ్చింది. అదేవిధంగా క్రింది వ్యాఖ్యలను పరిగణించండని అంటూ.. ‘ఏ. న్యూడిల్లీలో 2005 సంవత్సరంలో కే. చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమునకై నిరవధిక నిరాహార దీక్షను ప్రాంభించెను.
బీ.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శరద్ పవార్, కేసీఆర్(KCR)కు హమీని ఇవ్వడము జరిగింది. పై వ్యాఖ్యలతో ఏది/ఏవి సరైనది?’ అంటూ నాలుగు ఆప్షన్లతో ప్రశ్న వచ్చింది. ఇక, తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు అంటూ మరో క్వశ్చన్ వచ్చింది. అందులో ‘తెలంగాణ తల్లి విగ్రహం కిరీటము, వడ్డాణంలో కోహినూర్, జాకబ్ వజ్రముల ప్రతిరూపములను కూర్చారు. ఆమె పాదాలకు మెట్టెలు కరీంగనర్ ఫిలిగ్రీ వెండితో తయారు చేయబడింది. ఆమె గద్వాల్, పోచంపల్లి చీరలను పోలిన చీరలో ఉంది. ఆమె ఒక చేతిలో బోనమును పట్టుకుంది’ అనే నాలుగు ఆప్షన్స్ పెట్టారు. ఈ క్వశ్చన్ పేపర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గ్రూప్ 2 పరీక్షలో కేసీ ఆర్, టీఆర్ఎస్ గురించి ప్రశ్నలు pic.twitter.com/0U0S8bdIL3
— Telugu Scribe (@TeluguScribe) December 16, 2024
గ్రూప్ 2 పరీక్షలో ఒరిజినల్ తెలంగాణ తల్లి గురించి ప్రశ్న pic.twitter.com/sSd0E08kOr
— Telugu Scribe (@TeluguScribe) December 16, 2024