ప్రచారాలు మానేసి విద్యార్థుల బాగోగులను చూడండి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో శనివారం చేపట్టిన గురుకుల బాట కార్యక్రమం ఎట్లుందంటే, మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు తంగెళ్ళు దాటవు అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు.

Update: 2024-12-16 12:41 GMT

దిశ, వెబ్ డెస్క్;రాష్ట్రంలో శనివారం చేపట్టిన గురుకుల బాట కార్యక్రమం ఎట్లుందంటే, మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు తంగెళ్ళు దాటవు అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు.రాష్ట్రంలో శనివారం చేపట్టిన గురుకుల బాట కార్యక్రమం ఎట్లుందంటే, మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు తంగెళ్ళు దాటవు అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు.కాంగ్రెస్ సర్కారు గురుకుల బాట డొల్లతనం అని 24 గంటలు కూడా గడవక ముందే బయట పడిందని అన్నారు. సోమవారం మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే (Mahatma Jyotibapule) బాలికల హాస్టల్ లో (Girls Hostel) ఎలుకలు కొరికి (Rats bite) ఐదుగురు విద్యార్థినిలు ఆసుపత్రి పాలవడం దారుణం అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక కాట్లు, కుక్క కాట్లు, పాము కాట్లు, కరెంటు షాకులతో విద్యార్థులు తల్లడిల్లుతున్నా పట్టించుకోని దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రచారం పేరిట ఒక్కరోజు తమాషా చేయడం కాదు వారి బాగోగులను చూస్తూ, గురుకులాల్లో పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు లేకుండా చూడండి అంటూ హెచ్చరించారు.

Tags:    

Similar News