KTR : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం

సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2024-12-16 15:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఐదు కీలక ఆర్డినెన్స్(Ordinance) కు ఆమోద ముద్ర వేశారు. అలాగే భూమిలేని పేదలకు డిసెంబర్ 28 నుంచి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులు(Ration Cards) లేని వారికి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఇక ఈ-ఫార్ములా రేస్(E-Formula Race) లో నిధుల బదలాయింపుపై గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్(KTR) ను విచారించేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకొని గవర్నర్(Governor) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు(KTR Arrest)కు రంగం సిద్ధం అవుతున్నట్టు సమచారం. 

Tags:    

Similar News