అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కీలక ప్రశ్న.. మంత్రి శ్రీధర్ బాబు సమాధానం

రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Update: 2024-12-16 17:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో రాష్ట్రంలో నూతనంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) పార్కుల ఏర్పాటుపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 35 ప్రదేశాలను గుర్తించి 13,741 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. పార్కుల ఏర్పాటు కోసం గుర్తించి ఈ భూమిలో 2338 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 7638 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి, 3765 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని ప్రతిపాదించామన్నారు.

రెవెన్యూ అధికారు నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న తరువాత లే అవుట్‌ను తయారు చేసి అవసరమైన అనుమతులన్నింటిని పొందిన తర్వాత పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. అనుమతించిన కంపెనీలు ప్రొడక్షన్ ప్రారంభించాయా? లేదా? అని పర్యవేక్షణకు ఇండస్ర్టియల్ డైరెక్టర్ మల్సూర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశామన్నారు. టీజీఐఐసీ ఈడీతో పాటు మరొకరు సభ్యుడిగా ఉంటారన్నారు. ఈ కమిటీని అక్టోబర్ లో వేశామని, ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు. నివేదిక ఇవ్వగానే సభ్యులకు అందజేస్తామని వెల్లడించారు. కంపెనీలు ప్రొడక్షన్ స్టార్ట్ చేయకుంటే తిరిగి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News