Konda Surekha: వారిని ఒప్పించి, మెప్పించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం
కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు(Kawal Tiger Reserve Forest)ను ఇప్పటికే కన్వరేటివ్ రిజర్వు ఫారెస్టుగా డిక్లేర్ చేయడం జరిగిందని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) స్పస్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు(Kawal Tiger Reserve Forest)ను ఇప్పటికే కన్వరేటివ్ రిజర్వు ఫారెస్టుగా డిక్లేర్ చేయడం జరిగిందని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) స్పస్టం చేశారు. సోమవారం ఆమె శాసనమండలిలో మాట్లాడారు. ప్రత్యేక దృష్టితో కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం చలికాలం అయినందున ఫారెస్టు ఏరియాలో ఉండే వన్య ప్రాణులు సంచరించడం పెరగడంతో అక్కడ ఉండే ప్రాంతాల్లో గిరిజన, చెంచు ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్నట్టు చెప్పారు. వన్య ప్రాణాలకు కూడా ఇబ్బందులు జరగకుండా ఫారెస్టు ఏరియాలో ఉన్న కొన్ని గ్రామాలను తరలించడం జరిగిందన్నారు. ఈ విషయంలో అటవీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు.
తరలించిన వారికి చాలా సదుపాయాలు కల్పించినట్టు వివరించారు. అయితే, ఏండ్ల తరబడి జీవనం అక్కడే అలవాటు పడిన వారికి అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. వారిని ఒప్పించి, మెప్పించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు చెప్పారు. బయటికి తీసుకొచ్చిన వారికి ఊరికే వదిలేయకుండా అన్నిరకాల వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. అంతమందికి ఇండ్లు కట్టించి... నీటి వసతి కల్పించి... వారికి ఉపాధి మార్గాలు చూపించినట్టు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే కొంతమందిని కొన్ని ప్రాంతాలకు మళ్ళించడం జరిగిందని చెప్పారు. వాళ్ళలో కొంత అవగాహన తీసుకొచ్చి.. వేరే ప్రాంతాలలో ఇండ్లు కట్టించి.. వాళ్ళకి బతుకుదెరువు కల్పించి ఆర్థికంగా సాయం చేస్తున్నామన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టును కూడా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మాదిరి అభివృద్ధి చేస్తామని చెప్పారు.