రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో నిర్లక్ష్యం.. కలెక్టర్ కోపానికి కేర్ టేకర్ బలి
భువనగిరి పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ హనుమంత రావు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ హనుమంత రావు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి.. కేర్ టేకర్‌ని సస్పెండ్ చేశారు. మధ్యాహ్నాం భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, విద్యార్థులకు పెట్టే గుడ్లు సరిగా లేకపోవడంతో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో విద్యార్థులతో పనిచేయించడం, పెరుగుకు బదులు మజ్జిగ సరఫరా చేయడం ఏంటని ప్రశ్నించారు. డైనింగ్ హాల్ లో కొత్త మెనూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, డైనింగ్ హాల్ శుభ్రం లేకపోవడంతో కేర్ టేకర్ రమేష్‌ను సస్పెన్షన్ చేసి, స్కూల్ ప్రిన్సిపాల్‌కి షోకాజ్ నోటీసు జారీ చేశారు.