Deputy CM Bhatti: పదేళ్లు పాలించిన లీడర్లకు ఈ విషయం కూడా తెలియదా?.. భట్టి ఫైర్

అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-16 11:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ నిబంధనల మేరకే బీఏసీ(BAC) జరిగిందని స్పష్టం చేశారు. బీఏసీలో బీఆర్ఎస్(BRS) నేతలు వ్యవహరించిన తీరు సరిగా లేదని మండిపడ్డారు. అసెంబ్లీ(Assembly) ఎన్ని రోజులు నడుపాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారు.. పదేళ్లు పాలించిన లీడర్లకు ఈ విషయం కూడా తెలియదా? అని ప్రశ్నించారు. హరీష్ రావు చెప్పినట్లు సభ పనిదినాలు ఉండాలంటే ఎలా? అని మండిపడ్డారు. తాను ఎల్వోపీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేసింది నాకు తెలియదా..? అని భట్టి సీరియస్ అయ్యారు.

ఇప్పుడు కూడా సభ ఎన్ని రోజులు జరపాలో స్పీకరే డిసైడ్ చేస్తారని అన్నారు. అంతుకుమందు మండలిలో ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ(TGPSC) ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రశ్నపత్రాల లీక్‌, మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు వివరించారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించామని.. దశలవారీగా భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు చేపడతామన్నారు.

Tags:    

Similar News