Jakir Hussain : జాకీర్ హుస్సేన్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు, పద్మవిభూషణ్(Padma Vibhushan) జాకీర్ హుస్సేన్(Mahammed Jakir Hussain) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం(Condolence) తెలియజేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ప్రఖ్యాత తబలా విద్వాంసుడు, పద్మవిభూషణ్(Padma Vibhushan) మహమ్మద్ జాకీర్ హుస్సేన్(Mahammed Jakir Hussain) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం(Condolence) తెలియజేశారు. జాకీర్ హుస్సేన్.. తండ్రి అల్లారఖా బాటలో నడుస్తూ తబలా వాయిద్యం పట్ల, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో తనదైన ముద్ర వేసుకుంటూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సీఎం విచారం వ్యక్తం చేస్తూ.. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. అలకే జాకీర్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.